Bluepadచిన్నపోయింది తారాలోకం.
Bluepad

చిన్నపోయింది తారాలోకం.

S
Surya Prakash
17th Jun, 2020

Share

నిరాశతో,భరించలేని
వ్యకులతతో,పంచుకోక
దిగులు పగుళ్ళలో
సానుభూతి లేపనం
పూసేవాళ్ళులేక
నీలో నువ్వే కుమిలి
అణువణువూ రగిలి
వ్యధతో,బాధతో
నిన్ను బాధించిన
వారిని ఏమీ చేయలేక
నిస్సహాయతతో
నిన్ను నువ్వే
అంతం చేసుకున్నావా!
ముక్కు పచ్చనివాడా
నిండు జీవితాన్ని
బలచేసుకున్నావా!
సుశాంత్! నీ ఆత్మశాంతించుగాక !!

8 

Share


S
Written by
Surya Prakash

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad