Bluepadత్యాగధనులకు జోహార్లు
Bluepad

త్యాగధనులకు జోహార్లు

ఆనిరాజ్ కూచిపూడి
ఆనిరాజ్ కూచిపూడి
17th Jun, 2020

Share


వందనాలు.. వందనాలు..
అమరవీరులారా..!
డ్రాగన్ దుర్నీతికి బలైన బిడ్డలారా..!!

దేశాన్ని రక్షింప
పోరెంతో సలిపినారా.!
మంచు లోయలన్ని
నెత్తుటితో తడిపినారా..!!
దొంగదెబ్బను ఢీకొడుతూ
ప్రాణాలే అర్పించినారా.!
త్యాగానికి గురుతులుగా
దేశమాత ఒడిన ఒరిగినారా..!!

త్యాగధనుల్లారా..!
వందనాలు.. వందనాలు..
అమర జవానులారా..!!

మీ ధైర్యం.. వీరత్వం..
మరచిపోము.. మరువలేము..!
మీ తెగువ.. మీ మరణం..
వృధా కాదు.. ముగిసిపోదు..!

నూట ముప్పది కోట్ల గుండెల్లో
చిరస్థాయిగా మీ రూపం..!
చరిత్రలో మీ త్యాగం
అందరికి స్ఫూర్తివంతం..!!

జోహార్లు.. జోహార్లు..!
అమర వీరులారా.. !
భరతమాత ముద్దు బిడ్డలారా..!!

- ఆనిరాజ్ కూచిపూడి
సత్తెనపల్లి

9 

Share


ఆనిరాజ్ కూచిపూడి
Written by
ఆనిరాజ్ కూచిపూడి

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad