Bluepadపుస్తకం నిజమైన నేస్తం
Bluepad

పుస్తకం నిజమైన నేస్తం

కొప్పుల ప్రసాద్
కొప్పుల ప్రసాద్
17th Jun, 2020

Share



అంశం: "పుస్తకం- నిజమైన నేస్తం"
పుస్తకం చాలా ముఖ్యమైనదని పుస్తకాలను పువ్వుల వలె చూడవలెనని నార్ల చిరంజీవి గారు చెబుతూ తన శతకం తెలుగుపూల శతకములో మంచి పద్యమొకటి చెప్పారు..

పద్యం:
పుస్తకముల నీవు పువ్వువలెను జూడు
చిపం బోకు మురికి చేయ బోకు
పరుల పుస్తకములు నెరువు తెచ్చితివేని
తిరిగి యుమ్ము వేగ, తెలుగు బిడ్డ!

విశ్లేషణ: సకల సృష్టికి జ్ఞానం మూలం. జ్ఞానమంతా పుస్తకాలలో నిక్షిప్తమై ఉన్నది. కాబట్టి అలాంటి పుస్తకాలను చదవాలని అపురూపంగా చూసుకోవాలని.. వాటిని చించవద్దని, వాటిని పవిత్రంగా కాపాడుకోవాలని, మురికి చేయకూడదు.
ఇతరుల దగ్గర పుస్తకాలు తెచ్చుకుంటే చదివిన వెంటనే తిరిగి ఇచ్చేయమని. చెప్పారు

పుస్తకాలు జ్ఞాన సముపార్జనకు ఎంతో ఉపయోగపడే సంపదల వంటివి.. పూర్వం అంతా తాళపత్ర గ్రంథాలలో రాసే నిక్షిప్తం చేసే వారు.. మానవుడి నాగరికత పెరిగిన తర్వాత పుస్తకాల రూపంలో అచ్చు చేయడం మొదలైంది.. మనము మన ఆస్తి మాత్రమే కాకుండా, జ్ఞాన సంపాదనకుపయుక్తమైన పుస్తకాలను కూడా చాలా జాగ్రత్తగా కాపాడి ముందు తరాలకు అందించారు.. ఈ ప్రపంచమంతా మనల్ని విడిచిపెట్టి పోయినా. మన చేతిలో ఉన్న మంచి పుస్తకం మాత్రం మనవెంట వస్తూనే ఉంటుంది.
అందుకే అంటారు పెద్దలు.."చినిగిన చొక్కా అయినా వేసుకో. మంచి పుస్తకం కొనుక్కో"..
ఎక్కడికైనా ప్రయాణమైతే నేస్తం వలె మన వెంట ఉండేది పుస్తకాలే.. పుస్తకాలు చదవడం చాలా భారమై పోయిన రోజులివి.. కానీ పుస్తకపఠనం లేనిదే మానవుడు పరిపూర్ణులు కాలేదు. పుస్తకమే" "హస్తభూషణం"అన్నారు.

నేటి పిల్లలు టీవీ, సెల్ లతో కానీ కాలం గడిపేస్తున్నారు
వారికి పుస్తకాలు చదవడం అలవాటు చేసి..
పాఠ్యపుస్తకాలతో పాటు పిల్లల పుస్తకాలైన చందమామ ,బాలమిత్ర ,బాలభారతి, తెలుగు వెలుగు లాంటి విజ్ఞాన, కథల పుస్తకాలు చదవడం అలవాటు చేసి జ్ఞానవంతులుగా, నీతిమంతులుగా, నైతిక విలువలతో వ్యక్తులుగా మలచవచ్చు. జ్ఞానం వారికి అందించవచ్చు...అలాగే పుస్తకాల యొక్క విలువ తెలియజేసి వాటిని జాగ్రత్తగా చూసుకునే విధంగా వారిని తయారు చేయాలి.. వారికి ఏదైనా బహుమతి ఇవ్వాలనుకుంటే మంచి మంచి పుస్తకాలు తెలుగులో శతకాలు, గొప్పవారి జీవిత చరిత్రలు... బహుమతిగా ఇచ్చి వాటిని చదివే విధంగా ప్రోత్సహించాలి..

#మంచి పుస్తకం కొనుక్కో.. జీవితాన్ని మార్చుకో- దాన్ని పదిలంగా ఉంచుకో..#

కొప్పుల ప్రసాద్
నంద్యాల

25 

Share


కొప్పుల ప్రసాద్
Written by
కొప్పుల ప్రసాద్

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad