Bluepadఆత్మహత్య
Bluepad

ఆత్మహత్య

బంధకవి రామారావు
17th Jun, 2020

Share



నవమాసాలు, మాతృగర్భంలో,
అను క్షణం బతుకుతూ
బయట వెలుగులు
వీక్షించాలని, నిరీక్షించి
కేర్ కేర్ మని ఏడుపుతో
అందరికి ఆనందాలు పంచుతూ,
ఆవిర్భవిస్తుంది నవజాత సిసోదయం, !

తెల్లగా, స్వచ్ఛంగా, వున్న
ఆ అందమైన కాన్వాసు
లాంటి మనస్సుపై,
ఎన్నో రంగులు,
ఏవేవో అర్ధం కాని గీతలు,
స్పష్టత లేని ముఖచిత్రాలు !

అర్ధం కాని పరిస్థితులలో,
బతుక్కి అర్ధం లేదనే దుస్థితికి, వెళ్లి, అయోమయంతో, అసహాయతతో,
అంతర్ధానం అయితేనే
మనఃశాంతనే,
అజ్ఞానపు క్షణికావేశం, లో

అందర్నీ మరచి,
ఆప్యాయతలు విస్మరించి
అంతులేని మనో వేదన తో
మనోధైర్యం కోల్పోయి
మనస్సాక్షిని చంపుకొని,
అర్ధాంతరంగా చావాలనుకోడం
ఒక మనోరుగ్మత, అవుతుంది కదా
అది వ్యధా భరిత
అసందర్భ అస్తమయం !


9 

Share


Written by
బంధకవి రామారావు

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad