Bluepad" పరీక్ష "లు
Bluepad

" పరీక్ష "లు

P .Maha kailash
P .Maha kailash
29th Nov, 2021

Share

పరీక్షలు

ఒక్కసారి ఆలోచించండి .....
అప్పుడెప్పుడో పరీక్షలకు ప్రాణం పోశాడు మిస్సేల్
పిల్లల ప్రతిభకు ప్రమాణం కోసం .....!
నేడు పరీక్షలోని మార్కులే ప్రపంచం
అవి మారాయి యమ పాశం గా పిల్లల కోసం....!

ఒక్కసారి ఆలోచించండి .....

జీవితంలో పెట్టే చిన్న పరీక్షలకోసం .
జీవితమని పెద్ద పరీక్ష ఫేల్ అవుతున్నారు...!
కాదు కాదు తల్లిదండ్రులే ఫెయిల్ చేస్తున్నారు..

ఒక్కసారి ఆలోచించండి .....

ఫేల్ అయ్యామని  ప్రాణాలు తీసుకోవడం ఎంత తప్పో....
పరీక్షలకోసం ఒత్తిడి చేయడం కూడా అంతే తప్పు.
ప్రగతి అనేది పరీక్షల్లో ఉండదు.....
మార్పు చెందే పరిణామంలో ఉంటుంది ...!

ఒక్కసారి ఆలోచించండి .....

పరీక్షల్లో ఉండే పరిమిత మార్కుల కోసం...
నాలుగు గోడల కి పరిమితమయింది మాతరం..!
పరీక్షలోని ప్రశ్నలకి సమాధానాలు నేర్చుకుంటూ...
అనురాగాలు, ఆప్యాయతలు మరిచింది నేటి బాల భారతం...!

ఒక్కసారి ఆలోచించండి .....

చదువులో ఉండే పరీక్షలను ఎదుర్కోవడం నేర్పారు ....
కానీ జీవితంలో ఎదురైన ప్రతి సమస్య ఒక పరీక్ష అని మరిచారు...!
అవరోధాలను ఎదిరించి ఆనందంగా జీవించ గలిగిన మీరు....
నేర్చుకున్న అనుభవాలు మాకు పంచడం పూర్తిగా మరిచింది మీ తరం...!

ఒక్కసారి ఆలోచించండి .....

రెండు గడుల మార్కుల కోసం .....
మూడు అక్షరాల జీవితాన్ని ఒత్తిడి చెయడం ఎంతవరకు సమంజసం ...!
పరీక్షలు అన్నవి తరగతి వరకే....
జీవించడం అన్నది ప్రాణం ఉన్నంత వరకు....!

ఒక్కసారి ఆలోచించండి .....

ఆలోచన లేని ఆయుష్షు గొప్పదా ?
విచక్షణ లేని వివేకం గొప్పదా.......?
విజ్ఞానం తో కూడిన మెదడు గొప్పదా ?
సంస్కారం కలిగిన వ్యక్తిత్వం గొప్పదా...?
మీ ఊహకే వదిలేస్తున్నాను .....
ఒక్కసారి ఆలోచించండి............!



ఇది కేవలం కల్పితం మాత్రమే .ఎవరినీ ఉద్దేశించినది కాదు ...
---మీ కైలాస్❣️

4 

Share


P .Maha kailash
Written by
P .Maha kailash

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad