Bluepadకవి గొంతు
Bluepad

కవి గొంతు

కొప్పుల ప్రసాద్
కొప్పుల ప్రసాద్
29th Nov, 2021

Share

కవి గొంతు

బద్ధకంగా ఉన్న ఆకాశాన్ని
సూర్యుడు బద్దలుకొట్టి లేపుతాడు
తూర్పు రేకల కొండల్లో
ఉషోదయపు ఎర్ర జెండా ఎగిరినట్లు..!!

మేఘాలన్నీ మోసుక తిరిగే గాలి
శ్రమజీవి చమటను తుడిచి
చల్లదనానికి ప్రయత్నించినట్లు..!!

హృదయంలో కలం నాట్లు వేస్తే
అక్షరాలు పుష్కలంగా మొలిచి
కవితా కంకులు పండినట్లు..!!

అనుభవాలు వెళ్లిపోతే
కన్నీటి పాఠాలు గుర్తొచ్చే
నేను ఎన్నడూ ఒంటరి కాదు
సాహిత్యం ఎన్నడు నన్ను వదలనట్లు..!!

కంఠము తో ఎలుగెత్తి అరిచినా
హృదయానికి దగ్గరవుతుంది
గొంతు మూగబోయినా
కలం తట్టి లేపుతున్న ట్లు..!!

ప్రజల గుండె చప్పిడి
రచయిత గలంలో వినపడాలి
కవి కలం ప్రజల గొంతులో రావాలి..!!

*కొప్పుల ప్రసాద్*
*నంద్యాల*

0 

Share


కొప్పుల ప్రసాద్
Written by
కొప్పుల ప్రసాద్

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad