Bluepadగుండెల్లో గోదారి
Bluepad

గుండెల్లో గోదారి

వికటకవి-వెంకటరత్నం
16th Jun, 2020

Share

తపస్సీకరించిన కలలోని అలలు
లయలై అలా అలా లయలుగా అలవోకగా లతలల్లుకున్న నాకలలో మెదిలిన నాకలాల రాతలివి..
సాయం సంధ్యా కాలంలో
నీజ్ఞాపకాలను మోస్తూ నదీ తీరాలవెంబడి పరుగులు తీస్తూ కొండలు గుట్టలు రాళ్లు రప్పలు దాటుతూ.. పరుగులు తీస్తూ నీవులేని నీకోసం ఇక పయనించలేక.. బండరాయిపై నీపేరు చెక్కి..
నిస్సత్తువుగా జారిపోతున్న నాకంటి నుంచి రాలిపడ్డ కన్నీటి బిందువును గడ్డిపరక ఒకటి అమాంతంగా మింగేసి..
మందుకొట్టిన దానిలా ఉల్లాసంగా ఊగసాగింది..
చెలీ.. నీవలె.. !

9 

Share


Written by
వికటకవి-వెంకటరత్నం

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad