వుహాను గర్భంలో పుట్టి
మెల్లమెల్లగా
చీమ నడకలా నడిచి
అచ్చోసిన ఆంబోతులా
దేశాలు దాటి
వేగం పెంచి
ధరణిని గుప్పిట పట్టి
నెత్తుటి నాలుక బార్లగ చాచి
మానవాళిని కరువుతీరా
కబళిస్తోంది... కరోనా..!!😭
తొలి రోజుల్లో జాగ్రత్తగా ఉండి
ప్రభుత్వాల ఆదేశాలు
మూతికి మాస్కు😷
భౌతిక దూరం
శరణ్యమని పాటించి👌
రెండున్నర నెలల్లో
దేశం తాళం తొలగించగా
పిశాచి విడిచిపోయిందన్న భ్రమలో
మందలు మందలుగా మసలి
ఆసుపత్రులకు
వరుసలు కడుతున్నారు.. జనం..!!😢
పరీక్షా ఫలితాలు రాకుండా
మృతదేహాలకు అంత్యక్రియలు..!
పాలకుల సిఫార్సులు..
అధికారుల నిర్లక్ష్యమే..
రక్కసి విస్తరిస్తోందన్న వాదనలు..!
ప్రజాప్రతినిధులు, అంగరక్షకులు
వైద్యులు, జర్నలిస్టులు
పోలీసులు, సామాన్యులు
నిర్జీవులు అవుతుంటే
సర్వత్రా భయాందోళనలు..!
ఇప్పుడీ శత్రువును
అంతమొందించేదెలా..!!
ఎవరి నిర్లక్ష్యం ఇది..!?
జీవకోటిని శాసించే
మానవజాతి మనుగడకే
సవాలు విసిరిన దయ్యం నశించాలంటే.. !
విమర్శలు, వాదోపవాదాలు
కట్టిపెట్టి తిరిగి అందరూ
సమష్టి పోరాటానికి
కంకణబద్ధులు కావాలి..!
లాక్ డౌన్ ఉన్నట్లే మసలుకోవాలి..!!
మన నిర్లక్ష్యం వల్ల విలువైన
ప్రజలు ప్రాణాలు కోల్పోతే
వెలకట్టలేమని గ్రహించాలి..!!🙏🏾🙏🏾
-- ఆనిరాజ్ కూచిపూడి
సత్తెనపల్లి