ఎండనక వాననక ఎండనక వాననక
ఎండనక వాననక
రెక్కలు ముక్కలు చేసిన
కాయకష్టమంతా,
రేతిరి పానశాలలో,
ఆవిరి అయిపోయి,
కల్లు మత్తులో,
కల్లు మూసుకొని , నిద్దరోయె,
అజ్ణానపు బతుకులకు,
ప్రత్యక్ష సాచ్చి పర్ణశాల !
నమ్ముకున్నోళ్లు ,కడుపులుచేతపట్టి,
పాకశాలలో పట్టెడన్నం కూడా, దొరక్క
అలమటించే ఆకలి డొక్కలకు
నిలువెత్తు సాచ్చి పర్ణశాల !
చిత్తు కాయింతలమధ్య
పాత సీసాలతో, పాఠశాలలు మర్చి,
బలవుతున్న బాల్యానికి,
బలమైన సాచ్చి పర్ణశాల !
ప్రజాస్వామ్యం లో,
పెజలే గొప్ప అని భ్రమలో,
చిరిగిన బతుకుల్లోంచి,
పర్ణశాల సందుల్లోంచి,
వాస్తవాల గాలి ధాటిలో
అల్లల్లాడే ఆశా దీపాల మధ్య,
ఎలుగులు ఎప్పటికైనా వత్తాయని,
బతుకులు బాగా పండుతాయేమో అని
చిట్లించి చూస్తున్నాయి
ఎన్నో అమాయకపు,
అభాగ్యపు కళ్ళు,
విశాల భారతావనిలో !