Bluepadమహాకవి శ్రీ శ్రీ
Bluepad

మహాకవి శ్రీ శ్రీ

S
Surya_Kolluri
29th Nov, 2021

Share

ఓ మహాకవి మహాకవి
మాటలంటే భయమంటివి
రాతలతో సత్తువ రెచ్చగొడితివి
యతి ఉండదు ప్రాస ఉండదు
మదిన మెదిలే భాద తప్ప
సోమరులారా చావండి అంటివి
మనుషుల్లో సోమర్లను చంపేస్తివి
వెర్రిగాలి వెక్కిరింపు అంటివి
పిచ్చిజనాలను ప్రశ్నస్తివి
కాదేది కవితకు అనర్హమంటివి
చాలదులే ఏది నీ ఘనతకు వర్ణిచుంటకు
నీదొక మార్గం అనితర సాధ్యం
ఎన్నని చెప్పిన చాలవుగా
ఎన్నాళ్ళైనా మరవగలమా
మరో ప్రపంచం పిలిచిందా నిన్నో బాటసారి
మహా ప్రస్దానంలో ప్రయాణమైన ఓ సాహాసి
తలవంచుకు వెలిపోయావే నేస్తం
తల ఎత్తుకు తిరిగే సంపద మాకిస్తూ
మహాకవి !! కళారవీ !!
మహాకవి !! కళారవీ !!


17 

Share


S
Written by
Surya_Kolluri

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad