Bluepadసాగిపొతోంది...!!
Bluepad

సాగిపొతోంది...!!

కొప్పుల ప్రసాద్
కొప్పుల ప్రసాద్
15th Jun, 2020

Share

సాగిపోతుంది...!!

వయస్సు ఇంకిపోయింది
సొగసు నశించింది
జీవితమంతా సమరం
ప్రతినిత్యం జీవన్మరణ..!!

మనసు తడుముతున్న ది
గుండెను గుచ్చుకున్నది
తడిలేని కళ్ళు వాలిపోయి
తనువంతా పొడిబారి పోయింది..!!

చీకటి స్నేహం చేసింది
వెలుగు వెళ్ళిపోయింది
మబ్బులు కమ్ముకున్నాయి
జీవితానికి చీకట్లు అలుముకున్నాయి..!!

కృష్ణపక్షం కూర్చుంది
శుక్లపక్షం చేరుకుంది
అమ్మవాస్య కమ్మేసింది
బతుకంతా మాయలో పడింది..!!

మనిషికి మనోధైర్యం
గెలుపుకు చిరునామా
అపజయం పారిపోతుంది
విజయం వొళ్ళో కూర్చుంటుంది..!!

కలలన్నీ ఎదురుచూపులై
నిద్ర కోసం చూస్తున్నాయి
రెప్పలు మూతపడితే
పక్కకు చేరి కూర్చుంటాయి..!!

ఆకాశం సాగుతుంది
గమ్యం కోసం బాట వేస్తోంది
ఆలోచనల అడ్డంకులు
జ్ఞానం సాగిపొమ్మంటుంది...!!

కొప్పుల ప్రసాద్
నంద్యాల

6 

Share


కొప్పుల ప్రసాద్
Written by
కొప్పుల ప్రసాద్

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad