Bluepadస్ఫూర్తినిస్తున్నాయి..!
Bluepad

స్ఫూర్తినిస్తున్నాయి..!

ఆనిరాజ్ కూచిపూడి
ఆనిరాజ్ కూచిపూడి
14th Jun, 2020

Share

పుడమి పుత్రుల
స్వేదంతో తడిచిన
పొలం పులకింతలే
నా అక్షరాలు.!!

పచ్చని తివాచీలో
చిక్కిన చక్కని
పల్లె పరిమళాలే
నా పదాలు.!!

పొగచూరిన
పూరింటి
సుగంధాలే
నా వాక్యాలు.!!

బువ్వ సట్టి కింద
మండుతున్న
కట్టె చిటపటలే
నా ఆలోచనలు.!!

పొంతలో కాగి
పొగలు కక్కుతున్న
నీటి ఆవిరులే
నా గీతాలు.!!

శ్రమ జీవుల
చెమట చుక్కల
సౌందర్యమే
నా కవితలు.!!

కొలిమిలో
కణకణ కాలుతున్న
ఇనుము ఎర్రదనమే
నా పద్యాలు.!!

అందమైన
పాత్రగా చేసే
మట్టి సువాసనలే
నా కథలు.!!

బండను
శిల్పంగా మలుచుతున్న
ఉలి శబ్దాలే
నా కవనాలు.!!

- ఆనిరాజ్ కూచిపూడి
సత్తెనపల్లి, గుంటూరు జిల్లా

20 

Share


ఆనిరాజ్ కూచిపూడి
Written by
ఆనిరాజ్ కూచిపూడి

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad