Bluepadకాగితం ఎగిరే..!!
Bluepad

కాగితం ఎగిరే..!!

కొప్పుల ప్రసాద్
కొప్పుల ప్రసాద్
14th Jun, 2020

Share

కాగితం ఎగిరే...!!

బాధను పంచుకుంది కాగితం
బలాన్ని చేకూర్చింది అక్షరం
రాయడానికి ముందు కొచ్చింది కలం
ఆలోచనలకు వచ్చింది బలం..!!

తెల్లటి కాగితం పై
అక్షరాలు కదులుతున్నాయి
మబ్బుల్లో అలుముకున్న
కన్నీటి దారలు సిరా లో నింపి
కందినా హృదయములో నుంచి
ఎర్రటి చుక్కలు రాలుతున్నాయి..!!

కాగితం ముడతలు పడుతుంటే
మనసు నలిగిపోయింది
యదలో తడి ఆరిపోయింది
కలములో సిరా అయిపోయింది
వేదనా ఒక్కటి మిగిలిపోయింది...!!

కాగితం నిండలేదు
బాధలు తరగలేదు
కలము సాగలేదు
శరీరం అలసిపోయే
కన్నీళ్లు ఎండిపోయే
కాలం గడిచిపోయే
పాత గాయాలు నిలిచిపోయే..!!

కాగితం గాలికి ఎగిరింది
గుండెంతా కలుక్కుమంది
రాసిందంతా నలుపు అయ్యింది
హృదయం తెగిపోయింది
ఆకాశం శూన్యమై
ఆలోచన అదృశ్యమయ్యే
బాధంతా మిగిలిపోతుంది..!!

*కొప్పుల ప్రసాద్*
*నంద్యాల*

1 

Share


కొప్పుల ప్రసాద్
Written by
కొప్పుల ప్రసాద్

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad