Bluepadచేగువేరా జన్మదిన శుభాకాంక్షలు 🎊
Bluepad

చేగువేరా జన్మదిన శుభాకాంక్షలు 🎊

S
Surya_Kolluri
14th Jun, 2020

Share

చేగువేరా
చెరిగిన జుట్టు, నలిగిన షర్టు
పెదాన వెలిగే సిగార్, సూటిగా చూసే కన్ను
ఒ చరిత్రలో నిండిన రూపం
పసితనంలో ఆస్తమా ఎదురించిన
రగ్బీలాంటి ఆటలో రాణించిన గుణం
నాన్న చేతితో చదరం నేర్చినా
రాజ్యనీతిలే రచించిన తత్వం
మూడువేల పుస్తకాల చదివినా
విప్లవాల వృక్షానికి కొత్త అర్దం
మోటర్ సైకల్ పై నువ్వు చూసిన లోకం
నిన్ను నీకే పరిచయం చేసింది వినూత్నంగా
డాక్టరేట్ పట్టాలు వచ్చినా
మంత్రిగా పదవులు వచ్చినా
మంచికోసమే పయనం
కష్టానికి కదిలిన నీ మనసు
విప్లవానికి ప్రతిరూపం
యుద్ధంలో కొత్తవిధానం
సమస్యలపై పోరాటం
నీ జీవితం అమరం ఆదర్శం



8 

Share


S
Written by
Surya_Kolluri

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad