Bluepadకరోనా రాక్షసుడు
Bluepad

కరోనా రాక్షసుడు

కొప్పుల ప్రసాద్
కొప్పుల ప్రసాద్
13th Jun, 2020

Share

*కరోనా రాక్షసుడు కథ..!!*
కరోనా అనే రాక్షసుడు చైనా దేశంలో పుట్టి. తాను ప్రపంచాన్ని జయించాలని. బ్రహ్మ వద్ద భయంకరమైన తపస్సు చేసి ఎన్నో వరాలు పొంది నాడు. తాను మానవుడు ఉపయోగించే ఎలాంటి ఆయుధాలకు మరణం లేకుండా. అలా వరాలు పొందిన కరోనా భూమి మీద మానవులు వేధిస్తూ ఉన్నాడు. అతనికి అన్ని దేశాల అధిపతులు తన ప్రజలను రక్షించడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. కరోనా రాక్షసుడు తన మిత్ర సైన్యం వైరస్ లను కలుపుకొని మరింత అ బలంగా తయారై మానవ జాతి మీద విజృంభిస్తున్నాడు. మానవజాతి అంతా బాధలో మునిగిపోతుంది. రాక్షసుడు చేస్తున్న అరాచకాలకు దిక్కు తెలియక భూమాత దగ్గరకు వెళ్లి వేడుకుంటారు.
భూమాత కన్న బిడ్డలైన మానవులందరిని తీసుకొని బ్రహ్మ దగ్గరికి వెళుతుంది. కరోనా రాక్షసుడు చేస్తున్న ఘోరలను వినిపిస్తోంది. తన బిడ్డల చావుకు కారకుడైన వాడిని ఎలా చంపాలి , నీ వరప్రభావంతో తో వాడు ఇలా తయారయ్యాడు.  వాడి పీడనం ఎలా వదిలించాలి చెప్పమని బ్రహ్మను వేడుకుంటుంది.
బ్రహ్మదేవుడు నా వరానికి తిరుగులేదని. జాగ్రత్త సుమా.అంటూ  ఈ రాక్షసుడు మీ కంటికి కనబడడు. వాడిని ఎదుర్కోవడం చాలా కష్టం. వాడు మీకు చిక్కడు మీ లోనే ఉంటూ మిమ్మల్ని బలి చేస్తూ ఉంటాడు.మీకు తెలియకుండా మీలోనే ప్రవేశిస్తాడు. వాడు మామూలోడు. ఇక్కడ ఉంటాడు అక్కడ ఉంటాడు ప్రపంచమంతా ఉంటాడు. బయటికొస్తే బంధించి పారేస్తాడు.
ఏ ఆయుధం చేత మరణించాడు. కానీ వేయించడానికి నాలుగు నియమాలు, మాత్రమే ఉన్నాయని తెలిపారు.మానవులందరూ కలిసి ఎవరి గృహములో వాళ్ళు ఉండండి. చేతులను శుభ్రంగా కడుక్కోండి. బయటికొస్తే ముఖానికి వస్త్రాన్ని కట్టండి. సామాజిక భౌతిక దూరం పాటించండి.  మీరు నిష్ఠగా పాటిస్తే వాడు చస్తాడని బ్రహ్మ చెప్పాడు. ఇంట్లో ఉండి ప్రాణాలు కాపాడుకుంటూ. వాడిని అంతం చేయడమే లక్ష్యంగా మానవులందరూ బ్రహ్మలోకము నుంచి భూలోకం వస్తారు.
వారందరూ రామాయణాన్ని ఆదర్శంగా తీసుకొని కరోనా రాక్షసుని పై సంహారం కోసం నడుం కట్టారు. రాముడు లాంటి ఓర్పుతో, సీత లాంటి త్యాగము తో లక్ష్మణుడు లా సోదర భావంతో మెలుగుతూ బ్రహ్మ చెప్పిన నియమాలను పాటిస్తూ ఉంటారు.
అందరూ ఇంట్లో ఉండి వారి నియమాలతో మంత్ర ప్రభావంతో వైద్యులు శాస్త్రవేత్తలు కలిసి రామ బాణం లాంటి ఔషధం తయారుచేసుకుని రాక్షసుడితో యుద్ధం చేసి వాడిని సంహరించడానికి ముందుకు వస్తారు. ఆ యుద్ధములో కరోనా రాక్షసుడు మరణించాడు..
అప్పుడు మానవులంతా వైద్య దేవుళ్ళ పై పూలవర్షం కురిపించి ఆనందంగా పండగ చేసుకుంటారు. భూమాత బిడ్డలందరూ రక్షించబడి నందుకు. బ్రహ్మ దేవునికి కృతజ్ఞతలు తెలుపుతుంది
.
రచయిత కొప్పుల ప్రసాద్ నంద్యాల

23 

Share


కొప్పుల ప్రసాద్
Written by
కొప్పుల ప్రసాద్

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad