Bluepad | Bluepad
Bluepad
అమ్మతనం చూడరా...!
ఆనిరాజ్ కూచిపూడి
ఆనిరాజ్ కూచిపూడి
13th Jun, 2020

Shareసిగ్గుపడండ్రా.!
మద పిశాచాల్లారా.!

ఆర్నెల్ల పసి గుడ్డు అయినా
అరవై ఏళ్ల అవ్వయినా
మతిస్థిమితం లేకున్నా
అపరిచితురాలైనా
బంధువైనా.. ఆఖరికి
పేగు పంచుకు పుట్టిన బిడ్డయినా
ఆడదయితే చాలు..!
మీలో మగాడు మృగాడవుతున్నాడా.!

చచ్చిపోండిరా.!
సమాజానికి పట్టిన చీడల్లారా.!

దిశ ఘటనలో కాల్చేసినా
నిర్భయ దోషులకు ఉరేసినా
మీలో పరివర్తన రాదా..!?
చట్టమంటే భయంలేదా..!?
మానవత్వం మేలుకోదా..!?

అతివను ఆబగా చూడకుండా
అత్యాచారాలకు తావివ్వకుండా
నరాలు తెగ్గోసే మందేదో
మీకు పొడవాల్సిందేరా..!!

భ్రష్టులారా..!
ఆ అబలే కావాలంటే
మరో జన్మలో
ఆమె కడుపులో పుట్టండిరా.!
మిమ్మల్ని ఎత్తుకొని
హత్తుకొని లాలించి
పాలిచ్చి మీతో పడుకొంటుందిరా
అమ్మగా..! మాతృమూర్తిగా..!

ఎంత నీచుడినైనా బిడ్డగా
భావించే సద్గుణశీలిరా
ఆడదంటే..!!
జన్మజన్మలకీ సరిపోయే
ఆశీర్వాదాలనిచ్చే దేవతరా
ఆడదంటే...!!

*-ఆనిరాజ్ కూచిపూడి*

(ఇటీవల మహిళలపై పెరుగుతున్న అత్యాచార ఘటనలు గమనించి హృదయ వేదనతో...)

13 

Share


ఆనిరాజ్ కూచిపూడి
Written by
ఆనిరాజ్ కూచిపూడి

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad