Bluepadమనసే కవిత్వం
Bluepad

మనసే కవిత్వం

కొప్పుల ప్రసాద్
కొప్పుల ప్రసాద్
13th Jun, 2020

Share

మనసే కవిత్వము ..!!

హృదయము భారమైతే
కన్నీటి మేఘమై వర్షిస్తుంది
ఆ కన్నీరు అక్షర ధారలై
కవిత్వాన్ని రాస్తుంది..!!

మనసు వేదనైతే
శరీరం వణుకుతుంది
మనసు గాయమై
అక్షరాలను ధారా పోస్తుంది..!!

కాలం ఆగ్రహిస్తే
ఆలోచనా ఆకాశంలా గర్జిస్తుంది
ఉరుముల మెరుపులై
అక్షర వర్షం కురిపిస్తుంది..!!

బ్రతుకు ఎడారైతే
జీవితం నిర్జీవమౌతుంది
ఎడారి తుఫాను లై
అక్షర రేణువులు రాలుస్తుంది...!!

సంసారం సాగర మైతే
ఆశలు కెరటాలతో ఎగురుతుంది
సముద్ర ముత్యమై
అక్షర బొట్టుతో నింపుతుంది..!!

జ్ఞానము సందేశం మైతే
అంతరంగము ఆవిష్కరిస్తుంది
సాహిత్యం సంస్కార మై
అక్షరాలను ఆహ్వానిస్తుంది..!!

కొప్పుల ప్రసాద్
నంద్యాల

4 

Share


కొప్పుల ప్రసాద్
Written by
కొప్పుల ప్రసాద్

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad