Bluepadమారదులే ఈ లోకం
Bluepad

మారదులే ఈ లోకం

S
Surya_Kolluri
13th Jun, 2020

Share

మారదులే ఈ లోకం మారదులే ఈ లోకం
మారినచో జరుగునులే పెను విధ్వంసం
మారేందుకు కాలముంది మారాలని ఆశ వుంది
కానీ మారాలంటే కదలాలిగా మహాజనం

ఎటు చూసిన‌ కష్టాలు ఎటు చూసిన కన్నీలు
ఎటు చూసిన ఆకలి బాధలు కులాల కక్షలు
మతాల గోలలు మెక్కోదెవరనని రక్తపాతాలు
కానీ జగ్గకండి జగ్గకండి ఒ మహాభక్తులారా
మీ భక్తికి కాదుకాదు మీ భయానికి భయపడ్డ
ఆ మహాదేవుడు మాయమైయి శకాలే మారాయి

మతాన్ని మాటంటే మండిపోతామ్ కానీ
మతం ఎమ్ చెప్పిందో మరిచేపోయామ్
సమస్యని ప్రశ్నించే సమయంలేదు కానీ
ఇష్టాలను పంచుకోనేందుకు దొరికిందిలే బహు‌తీరిక

అయినా తప్పేవరిది తప్పేవరిది
పాలించే ప్రభువులుదా మౌనమే మన శబ్దమై
తలరాతనే మన శాశనంగా భరించే‌
నీది‌నాది మనందరిదా

మారాలంటే కావాలిలే మరో గాంధీ అయినా
ఎక్కడనుండి వస్తారులే చేగువేర‌లు శ్రీశ్రీలు
మనలోనే నిద్రించిన మహానుభావులు
ఒక్కసారైనా తట్టిలేపు చూడగలవేమౌ నరలోకం


9 

Share


S
Written by
Surya_Kolluri

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad