Bluepadరేష్మ ఇల్లు చేరిందా..!!
Bluepad

రేష్మ ఇల్లు చేరిందా..!!

కొప్పుల ప్రసాద్
కొప్పుల ప్రసాద్
12th Jun, 2020

Share


శీర్షిక:రేష్మ ఇల్లు చేరిందా..!!

రేష్మ చాలా చక్కని బొమ్మ..
అందరూ ఆ అమ్మాయిని చూసి హీరోయిన్ మాద్రి ఉన్నావంటూ మెచ్చుకునేవారు. చాలా మంచి అమ్మాయి.
అందరికీ సహాయం చేస్తూ చదువుకుంటూ ఉన్నది.
అదే ఊరిలో చిల్లర వెధవ రహీం అనే వాడు ఉండేవాడు.
వాడికి లేని అలవాట్లు లేవు. అన్ని ఊర్లు తిరిగేవాడు.
ఒకసారి బాంబే కి పోయి. అక్కడి రెడ్ లైట్ ఏరియా మనుషులతో పరిచయం చేసుకొని, అమ్మాయిలను సప్లై చేసేవాడు.

వాడి కళ్ళు కాలేజీకి పోయే రేష్మా మీద పడ్డాయి.
ప్రతి రోజు కాలేజీకి వెళ్లి రేష్మ తో పరిచయం పెంచుకొని,
రోజూ కలిసి మాట్లాడేవాడు.
తాను "ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్" నని "బొంబాయిలో జాబ్ చేస్తున్నానని"రేష్మా కు చెప్పి చిన్నగా ఆమెను ప్రేమలోకి దించి నాడు. కొన్నాళ్ల తర్వాత వాళ్ల ఇంట్లో వాళ్లకు ఒప్పించి,
రేష్మాతో నీకా చేసుకొని.. బాంబే వెళ్ళిపోయాడు..
అక్కడ రేష్మా ను రెడ్ లైట్ ఏరియా లో బేరం పెట్టి...
రేష్మా ను తీసుకొని వెళ్లి, అక్కడి వాళ్ళతో పరిచయం చేసి.
"వీళ్లు మా చుట్టాలు వీడి దగ్గర ఉండు"అని అని చెప్పి.
నాకు దుబాయ్ లో జాబ్ వచ్చింది. "ఒక నెల తర్వాత నిన్ను తీసుకెళ్తానని" చెప్పి. రేష్మా కథ చెప్పి వెళ్ళిపోయాడు. వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు.

రేష్మా కు రెండు రోజుల తర్వాత రెడ్ లైట్ ఏరియా, అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు వ్యభిచార గృహాలు చూసి మనసులో అనుమానం వేసింది. అక్కడ స్త్రీలను హింసించడం, మందు తాపడం, వాళ్ల మాటలు వినకుంటే కొట్టడం, వారికి నరకయాతన చూపించడం, ఇదంతా చూసి చూసి రేష్మ తాను రహీమ్ నమ్మినందుకు చాలా బాధ పడి పోయింద.అయినా తెలియనట్లు నటిస్తూ, ఒక రెండు రోజులు గడిపి, వారి కళ్లుగప్పిఅక్కడి నుంచి బయటపడి. బతుకు జీవుడా అంటూ ఊరికి చేరుకున్నది...
కొప్పుల ప్రసాద్
నంద్యాల

17 

Share


కొప్పుల ప్రసాద్
Written by
కొప్పుల ప్రసాద్

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad