Bluepadఅక్షర స్పర్శ...!!
Bluepad

అక్షర స్పర్శ...!!

కొప్పుల ప్రసాద్
కొప్పుల ప్రసాద్
12th Jun, 2020

Share

✍అక్షర స్పర్శ..!!

నిరంతర జీవన పరిశోధన
నిత్య ఆత్మ వేదన
జ్ఞాన బోధన
అందమైన నివేదన
ధర్మము కోసం శోధన
అక్షరాలతో నే సాధన
అనునిత్యము ఆవేదన
అల్లిన మాటలు ఎన్నో రాయన
కవితల్లో అల్లన
సజీవ వాక్యాలు జాలువారే
హృదయాలను వెలిగించే
ఆశల జ్ఞాన దీపాలై
అక్షర జ్ఞానాన్ని వర్షించే
అమృత ధారలై
ప్రపంచమంతా వెలుగు లై
ప్రభాత సూర్యు డై
నింగిలో నింపిన అక్షర రూపం మై
జగతిలో ఉదయిస్తాయి
హృదయాలలో విస్తరిస్తాయి
ఎందరినో శ్వాసిస్తాయి
సంఘములో భాసిస్తాయి
సువాసనలు వ్యాపిస్తాయి
ఆనందాలను అందిస్తాయి
సమాజ శ్రేయస్సు ఉద్యమిస్తాయి

*కొప్పుల ప్రసాద్*
*నంద్యాల*

22 

Share


కొప్పుల ప్రసాద్
Written by
కొప్పుల ప్రసాద్

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad