Bluepadబాల్యం భవిష్యత్తు పునాది...
Bluepad

బాల్యం భవిష్యత్తు పునాది...

sravya peddinti
sravya peddinti
12th Jun, 2020

Share

(బాలకార్మికుల దినోత్సవం సందర్భంగా)

మాసిపోయి మసిపట్టిన బ్రతుకులు
కలం కదపక
కాలంతో, బరువుతో
బంగారు భవిష్యత్తుని
పునాదైన బాల్యాన్ని
మరిచి, విడిచి
ఈదుతూ, సాగుతూ...

చదువుతో సాగలేదే
బరువుతో ముక్కలైనదే
అటు సందుల్లో
ఇటు నిర్మాణాల్లో
చిక్కుక్కుపోతూ, చిట్లిపోతూ
లేదే లేదులే గమ్యం
నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్తే
చాలుగా పూటకి... ఈ పూటకి..

చెప్పలేదే వాళ్లెవరు
చూపించలేదు ఏ దారి
దిక్కులేక ఈ గోదారి
తలవ్రాత తో ఈ రహదారి...


కలం పట్టి అడుగు పడాలి
పదం పదం తెలిసి గమ్యంలో నడవాలి
బరువు తొలగి గెలుపు చెందాలి
చీకటి విడిచి ఈ వెలుగులో సాగాలి
బడి బాట పట్టి ఈ బ్రతుకుని గెలవాలి.....

పెద్దింటి శ్రావ్య

21 

Share


sravya peddinti
Written by
sravya peddinti

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad