Bluepadసాహితీ మహావృక్షం..!!
Bluepad

సాహితీ మహావృక్షం..!!

కొప్పుల ప్రసాద్
కొప్పుల ప్రసాద్
12th Jun, 2020

Share

సాహితీ మహావృక్షం..!!

అతనొక సాహితీ మహా వృక్షము
ఎన్నో నూతన ప్రక్రియలను పుష్పించే
యుగాల గీతాలతో మురిపించే
నవరసాలు తన గీతాలలో ఒలికించే
కమ్మని రమణీయ పాటలెన్నో అందించే
వసంతాలెన్నో పూయించే
సినిమా గేయాలలో ధ్రువతారగా నిలిచే
గులేబకావళి తో గీతాలను గుబాళింప చేయించే
మధురమైన పాటలతో మనసు దోచే
కోటి దేవతలను పక్కనపెట్టి
అతను అమ్మనే తూచే
చక్కని తెలుగు మాటలతో
తెలిసిన పదాలతోనే పాటలు పాడించే
మనోఫలకంపై ముద్రించే
అక్షరాలతో లక్షల మనసులను గెలిచే
అద్భుతమైన కావ్యాలెన్నో సృష్టించే
తెలుగులో గజల్స్ పలికించే
ప్రపంచ పదులు సృష్టించే
కొత్త కొత్త ప్రయోగాలకు రూపమిచ్చే
ఉర్దూ భాషలో చదువు నేర్చే
తెలుగు భాషలో పద ప్రయోగము చేర్చే
ఉస్మానియా లో ఆచార్యునిగా నిలిచే
విద్యార్థులకు తెలుగు పై మక్కువ పెంచే
ఎన్నో కావ్యాలను తెలుగు వారికి అందించే
ఒక్క కావ్యం ఒక ఆణిముత్యం గా నిలిచే
భారత పద్మాలను తన మెడలో అలంకరించే
విశ్వంభర కావ్యానికి దేశానికి అందించే
జ్ఞానపీఠ అవార్డుతో తెలుగు ఖ్యాతిని పెంచే
తెలుగు భాషను ఒక వెలుగు వెలిగించే

కొప్పుల ప్రసాద్

నంద్యాల

9 

Share


కొప్పుల ప్రసాద్
Written by
కొప్పుల ప్రసాద్

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad