Bluepadఆత్మశుద్ధి
Bluepad

ఆత్మశుద్ధి

కొప్పుల ప్రసాద్
కొప్పుల ప్రసాద్
12th Jun, 2020

Share


ఆత్మశుద్ధి
ఆత్మశుద్ధి ఆత్మశుద్ధి

చిత్తశుద్ధి లేని వాళ్ళు ఎన్ని పూజలు చేసినా ఉపయోగంలేదు. ఆత్మశుద్ధి లేని ఆచారం కడగని పాత్రతో వండిన పదార్థం వంటిదని నిరుపయోగం అని వేమన చక్కని పద్యంలో వివరించారు..

పద్యం:

ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల
భాండశుద్ది లేని పాకమేల?
చిత్తశుద్ది లేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ వినురవేమ!

విశ్లేషణ: మనసు నిర్మలంగా లేనట్లయితే ఆచారాలను పాటించడం ద్వారా ప్రయోజనం లేదు. పాత్రలు శుభ్రంగా లేని వంట, మనసు స్థిరంగా లేని శివపూజ వ్యర్థమవుతాయి. ఏ ప్రయోజనము ఉండదు.

ప్రతిదినం వంటకు ముందు పాత్రం ఎలా అయితే శుభ్రము చేసుకుంటామో, నిత్యం నిద్ర లేవగానే కానీ, నిద్ర కు వెళ్లే ముందు గాని చిత్తశుద్ధితో ఒక్కక్షణం ఈరోజు నేనేమైనా తప్పులు చేశానా, నా వలన ఎవరికైనా బాధ కలిగిందా. నా ప్రవర్తన ఎవరైనా నొప్పించిందా?
ఎవరికైనా హాని కలిగించినదా? ఇలా చెయ్యటం తప్పేం కాదు? ఇలాంటి తప్పులు చేయకుండా ఉండడం.సాధ్యపడదా? సాధ్యమవ్వాలంటే ఏం చేయాలి? ఇలా చిత్త శుద్ధితో ఆత్మ శుద్ధి చేసుకుంటే. ఆత్మ పరమాత్మ రూపంలో మారుతుంది మనిషి దేవుడు అనిపించుకుంటాడు..

*చిత్తం చెప్పుల మీద భక్తి శివుని మీద అన్నట్లు* కాకుండా మంచి మనసుతో మనము చేసే తప్పులను తెలుసుకొని వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు సాగిన అంటే మనమే గొప్ప వారితో సమానం అవుతాము.. ప్రతి వ్యక్తిలోను దైవాన్ని దర్శించు కుంటాను.. మానవ సేవయే మానవ అని నిరూపిస్తాను..

#ఆత్మశుద్ధి, పవిత్ర బుద్ధి, మానవునికి గల గొప్ప శక్తి#

కొప్పుల ప్రసాద్
నంద్యాల

20 

Share


కొప్పుల ప్రసాద్
Written by
కొప్పుల ప్రసాద్

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad