Bluepadఎక్కడ ఉంది?
Bluepad

ఎక్కడ ఉంది?

S
Surya_Kolluri
12th Jun, 2020

Share

హాయి అన్నది ఎక్కడ ఉంది ?
సయనించే రేయిన తప్ప !
వెలుగు అన్నది ఎక్కడ ఉంది ?
ఉదయించే రవికిరణంలో తప్ప !
మతం అన్నది ఎక్కడ ఉంది ?
ఆ పదం అర్దంకానోడి అంగట్లో తప్ప !
రంగురూపులకు చోటు ఎక్కడ ఉంది ?
వెన్ను వంగితే చేతికర్ర సాయము తప్ప !
సుఖ సంపదల సౌభాగ్యం ఎక్కడ ఉంది?
ఎంతైనా బతికేది బువ్వకు తప్ప !
కోపం అన్నది ఎక్కడ ఉంది ?
ఎదిరించే బలం లేనోడి దగ్గర తప్ప !
ఒపిక అన్నది ఎక్కడ ఉంది ?
తలరాతని తలుస్తూండే బతుకులలో తప్ప !
స్వాతంత్రం ఎక్కడ ఉంది?
చెరిగిన చరితపుటలలో తప్ప!
బానిసత్వం ఎక్కడ ఉంది ?
తలదించుకు పనిచేస్తున్నోళ్ళో తప్ప !
శ్రమ అన్నది ఎక్కడ ఉంది ?
కిందోడిని తొక్కడంలో తప్ప !.
నీతి అన్నది ఎక్కడ ఉంది ?
అవినీతి చాటున అపురూపంగా తప్ప !
నమ్మకం అన్నది ఎక్కడ ఉంది ?
నమ్మతగ్గటోళ్ళు లేరు అనే మాటలో తప్ప !
అహింస అన్నది ఎక్కడ‌ ఉంది ?
హింస అనంతరం తప్ప !
మౌనం అన్నది ఎక్కడ ఉంది ?
ప్రశ్నించే తత్వం మరిచిన ప్రజల్లో తప్ప !
ప్రశ్న అన్నది ఎక్కడ ఉంది ?
భాదిస్తూన్న బుర్రలలో తప్ప !
గెలుపు అన్నది ఎక్కడ ఉంది ?
ముందుస్దానమే విజమనేవారిలో తప్ప !
ఒటమి అన్నది ఎక్కడ ఉంది?
వెక్కిరించే ప్రతి నోటిమాటలలో తప్ప !
ఆశ అన్నది ఎక్కడ ఉంది ?
ఆలోచిస్తే అన్నిటా అదే ఉంది
నేను అన్నది ఎక్కడ ఉంది ?
నా లోనే నలుగురు నాతో లేకుంటే తప్ప !
మనం అన్నది ఎక్కడ ఉంది ?
మన అనుకునే మాయలో తప్ప !
దైవం అన్నది ఎక్కడ ఉంది?
సాయం చేసే మవిషి రూపంలో తప్ప !
రోజంతా ఆలోచనలే
ప్రతి ఆలోచన అవసరమే !!


1 

Share


S
Written by
Surya_Kolluri

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad