Bluepadతెలుగులో ఆనాటి ఎవర్గ్రీన్ చిత్రాలు
Bluepad

తెలుగులో ఆనాటి ఎవర్గ్రీన్ చిత్రాలు

R
Reshma us
29th Nov, 2021

Share





మాయాబజార్ :

ఈచిత్రం నిజంగా ఎంతో మందిని ఆకట్టుకుంది. మాయాబజార్ తెలుగు చలనచిత్ర రంగం లో అత్యంత ప్రజాదరణ పొందిన ఒక సినిమా. ఎంతో మంది ప్రజలు ఈ చిత్రానికి ముగ్ధులు అయిపోయారు. సీఎన్ఎన్ న్యూస్ 18 టీవీ ఛానెల్ నిర్వహించిన సర్వే లో భారతీయ సినిమాల్లో సార్వకాలిక అత్యుత్తమమైన సినిమాగా మాయాబజార్ ఎంపికైంది.

అయితే ఈ చిత్రం దేశమంతటా 1957 మార్చి 27వ తేదీన విడుదలైంది అప్పుడు విడుదలైన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయం సాధించింది. 2017 మార్చి నాటికి 60 ఏళ్ళు ఈ సినిమా పూర్తి చేసుకుంది. ఇప్పటికి కూడా ఆ సినిమాని ఎంతో మంది ఇష్ట పడుతున్నారు. నిజంగా ఎవర్ గ్రీన్ అనడం లో తప్పులేదు. ఈ చిత్రం కి షావుకారు పాతాళభైరవి మిస్సమ్మ జగదేకవీరుని కథ గుండమ్మ కథ లాంటి జనరంజక చిత్రాలను నిర్మించిన సంస్థ రూపొందించిన గొప్ప కళాఖండం. ఇది ఈ చిత్రానికి దర్శకుడు కె.వి.రెడ్డి ఈయన భక్త పోతన యోగివేమన గుణసుందరి కథ పాతాళభైరవి దొంగరాముడు వంటి అద్భుత సినిమాలను తెరకెక్కించారు.

అయితే ఇటువంటి గొప్ప వాళ్ళ చేతుల మీదగా ఈ సినిమా రావడం అలానే గొప్పగా ఈ సినిమాని చెప్పుకోవడం గొప్ప పలుకుబడి దీనికి అందడం తెలుగు వారి గొప్పతనం. అయితే ఈ సినిమాలో నందమూరి తారక రామారావు అక్కినేని నాగేశ్వరరావు ఎస్వీ రంగారావు సావిత్రి గుమ్మడి ఋష్యేంద్రమణి ఛాయాదేవి సంధ్య సి ఎస్ ఆర్ తారాగణం చేశారు. ఘంటసాల వెంకటేశ్వరరావు సాలూరు రాజేశ్వరరావు సంగీతం అందించారు. పింగళి నాగేంద్రరావు ఈ సినిమాకి గీత రచన చేశారు ఈ సినిమాను నిర్మించింది నాగిరెడ్డి చక్రపాణి నాగిరెడ్డి మరియు చక్రపాణి.

గుండమ్మ కథ:

ఈ చిత్రం కూడా అత్యంత విజయవంతమైన చిత్రం అప్పటిలో ఇది అగ్రశ్రేణి నటుల తో నిర్మించిన మల్టీ స్టారర్. అయితే సూర్యకాంతం పాత్ర పేరు మీద సినిమా పేరు పెట్టడమే నిజంగా ఒక గొప్ప వైవిధ్యం హాస్యం సంగీతం. ఈ చిత్రానికి మరింత అద్భుత విజయాన్ని అందించడానికి మూల మయ్యాయి. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది కమలాకర కామేశ్వరరావు. బి.నాగిరెడ్డి చక్రపాణి నిర్మించారు. రచన పింగళి నాగేంద్రరావు ఈ చిత్రం లో నందమూరి తారక రామారావు అక్కినేని నాగేశ్వరరావు సావిత్రి జమున ఎస్.వి.రంగారావు సూర్యకాంతం ఛాయాదేవి రమణారెడ్డి హేమలత హరనాథ్ ఎల్.విజయలక్ష్మి రాజనాల తారాగణం చేశారు. ఘంటసాల ఈ చిత్రానికి సంగీతం అందించారు ఈ చిత్రం 7 జూన్ 1962 లో విడుదల అయింది నిజంగా ఎవర్గ్రీన్ చిత్రాల్లో ఈ చిత్రం కూడా ఒకటి.

దాన వీర శూర కర్ణ :

దాన వీర శూర కర్ణ సినిమా చాలా విధాలుగా రికార్డులు సృష్టించింది. ఈ తెలుగు సినిమా 1977 సంవత్సరం లో విడుదలైనది. గొప్ప పౌరాణిక చిత్ర రాజం ఇది. ఈ చిత్రం కూడా నిజంగా చూడవలసింది ఎవర్గ్రీన్ చిత్రాల్లో ఈ చిత్రం కూడా ఒకటి. ఈ చిత్ర కథ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన నందమూరి తారక రామారావు నిర్మించారు. అయితే ఈ కథ మహాభారతం లోని కథ

అయితే ఈ చిత్రంలో నందమూరి తారకరామారావు నందమూరి హరికృష్ణ నందమూరి బాలకృష్ణ కైకాల సత్యనారాయణ శారద ప్రభ ఎస్.వరలక్ష్మి చలపతిరావు చక్కటి పత్రాలు చేశారు ఈ చిత్రానికి సంగీతం పెండ్యాల నాగేశ్వర రావు అందించారు ఈ చిత్రం జనవరి 14 , 1977 లో విడుదల అయింది. రికార్డులు బద్దలు కొట్టింది ఈ చిత్రం.

1 

Share


R
Written by
Reshma us

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad