Bluepad
వర్షం -హర్షం
కొప్పుల ప్రసాద్
11th Jun, 2020
Share
🌧️వర్షం - హర్షం🌦️
నంద్యాల లో వర్షం
చల్లదనానికి హర్షం
చల్లబడింది ఉష్ణం
శరీరమంతా శీతోష్ణ..!!
మాడిన భూములు
పారాలి చినుకులు
ఎండిన నదులు
నిండాలి జలాలు..!!
ఆకాశములో ఉరుములు
చిగురాశలకు మెరుపులు
వర్షం నీటి పరుగులు
పచ్చదనానికి చిగురులు..!!
వచ్చిన పవనాలు
కురిసిన అందాలు
వెలసిన సొగసులు
పొంగిన మనసులు...!!
ముత్యపు చినుకులు
సొగసైన పలుకులు
ప్రకృతికి వలపులు
భూమాతకు మొలకలు..!!
చీలిన నేలలు
చేరిన ఊటలు
ఊరిన పంటలు
మారినా రాతలు...!!
భువిలో విత్తనాలు
పోసుకున్నాయి ప్రాణాలు
బయటికి మొలకలు
ఆకాశానికి దండాలు..!!
మాడిన ఆకులు
ఎండిన వృక్షాలు
నింపుకున్న వసంతాలు
రుతువుల సత్యాలు...!!
ఏరువాక పర్వము
రైతులకు వరము
సేద్యానికి అనుకూలము
సంబరము గా వర్షము..!!
నాగలి ఆడిన ఆటలు
నేలపై రాసిన గీతాలు
వర్షపు జల్లులతో పాటలు
చేతినిండా పంటలు..!!
నింగిలో మేఘాలు
ధరణిలో ఆశలు
వ్యవసాయానికి పనులు
సిద్ధమైన జనాలు...!!
పశువుకు గ్రాసము
పాలతో ఆదాయము
సాగును జీవనము
వర్షమే ప్రాణాధారము..!!
ప్రతి ప్రాణికి వర్షము
సృష్టికి జీవము
ప్రపంచానికి నిలయము
ఎక్కువైతే ప్రళయం...!!
కొప్పుల ప్రసాద్
నంద్యాల
17
Share
Written by
కొప్పుల ప్రసాద్
Comments
SignIn to post a comment
Recommended blogs for you
Bluepad
Home
Sign In
शोधा
About Us