Bluepadగూగుల్
Bluepad

గూగుల్

కొప్పుల ప్రసాద్
కొప్పుల ప్రసాద్
11th Jun, 2020

Share

*💻గూగుల్..!!📱*

మాయ ప్రపంచములో మాయాబజార్
కళ్ళముందే స్వర్గాన్ని నుంచే
స్వప్న లోక సుందరి
అరచేతిలో అద్భుతాలు
సృష్టించే మాయ దండం
స్వర్గాన్ని ఎవరూ చూడలేదు
కళ్ళముందు ప్రత్యక్షమయిన
త్రిశంకు స్వర్గం
శోధనకు సాధనకు
జ్ఞాన భాండాగారం
అనంత విశ్వాన్ని
అరచేతిలో చూపె జ్ఞాననేత్రం
సమస్తాన్ని చూపించి
జ్ఞాన బోధ చేసే విశ్వరూపం
అందు గలడు ఇందు లేడు
ఎందెందు వెతికినా అందు గలడు
అంతటా వ్యాపించిన సర్వాంతర్యామి
సర్వ జగత్తును
పాలిస్తున్నటువంటి పరమాత్ముడు
సాంకేతిక సామ్రాజ్యానికి
మా కుటుంబము లేని మహారాజు
అణువు నుండి అంతరిక్షం వరకు
నేల నుండి పాతాళం నుండి అనంతం
సమస్తాన్ని శోధించి పెట్టే జ్ఞాన ఊట
మానవ నాగరికత
విప్లవానికి పురుడు పోసిన
జీవము లేని యంత్రం
సమస్తము కళ్ళముందు ఉంచే మంత్రం
జ్ఞానముతో నిండిన తంత్రం
నేటి విజయాలకు అదే సూత్రం
కాగితం లేని సత్య పత్రం
అదే అదే గూగుల్ జంతర్ మంతర్..!!

*కొప్పుల ప్రసాద్*
*నంద్యాల*


13 

Share


కొప్పుల ప్రసాద్
Written by
కొప్పుల ప్రసాద్

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad