Bluepadఇప్పుడే అసలైన పరీక్ష
Bluepad

ఇప్పుడే అసలైన పరీక్ష

కొప్పుల ప్రసాద్
కొప్పుల ప్రసాద్
11th Jun, 2020

Share

ఇప్పుడే అసలైనపరీక్ష..!!*

కరోనా ను తప్పించేందుకు శిక్షణ
మనకు మనమే రక్షణ
వేసిన తాళం తీశారు
తెరుచుకున్నాయి అన్ని దారులు
వాణిజ్య ప్రార్థనా మందిరాలు
అంతటా తలుపులు తెరిచారు
చేతులెత్తేసిన ప్రభుత్వాలు
తాకొద్దు ఎవరి చేతులు
ప్రయాణంలో చేసుకో జాగ్రత్తలు
నీ చుట్టూ గమనించు..!!

నడుస్తున్నది దేశం
నడవడికలో మార్పు తెచ్చుకుందాం
ప్రతి ఒక్కరం పాటిద్దాం
ముఖానికి వస్త్రం మాత్రం మరవద్దు
కట్టిన మఖ అస్త్రం తీయొద్దు
భౌతిక దూరం మరవద్దు
చేతులు అక్కడ ఇక్కడ పెట్టొద్దు
ప్రతిక్షణం శుభ్రంగా ఉంచుకుందాం
నీ పని నీవు చేస్తూ..!!

నిన్ను నీవు రక్షించుకుంటూ
ప్రతిరోజూ చేయాలి కరోనా తో యుద్ధం
లేదంటే కాటేస్తుంది
నిన్ను అది వశపరచుకుంటుంది
నీ ఇంటిని ఆక్రమిస్తుంది
నీతో తిరిగిన వాళ్లకు నొప్పి స్తుంది
తస్మాత్ జాగ్రత్త మిత్రమా..!!

రోడ్డు పైకి పోతున్నాం
దారుల వెంట నడుస్తున్నాం
పొట్టకూటి కోసం పనులు చేస్తున్నాం
మనల్ని మనమే కాపాడుకోవాలి
మన బ్రతుకులు మనమే బ్రతకాలి
నిరంతర జాగరూకతతో ఉండాలి
ప్రతినిత్యం జీవనపోరాటం
బ్రతకడమే మన అందరి ఆరాటం..!!

*కొప్పుల ప్రసాద్*
*నంద్యాల*

18 

Share


కొప్పుల ప్రసాద్
Written by
కొప్పుల ప్రసాద్

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad