Bluepadస్వాగతం లోకమా !!
Bluepad

స్వాగతం లోకమా !!

S
Surya_Kolluri
11th Jun, 2020

Share

న్యాయానికి కళ్ళు లేవంటే
ధర్మానికి దిశ లేదంటే
కధ ఇంతే అందామా
నీకే ఉంటే ఆ కళ్ళు
నీకు గుచ్చుకుంటే ఆ ముళ్ళు
వంగిన వెన్నుని విల్లులా మారుస్తూ
తలవొగ్గని సత్యమని వాదిస్తూ
పీడించే భయాన్ని పీడిస్తూ
అడ్డొస్తే అంతరాత్మనైనా ప్రశ్నిస్తూ
మతమనే భూతాన్ని తరిమేస్తూ
అహంకారం ని అహృతి చేస్తూ
మోసాలని మట్టిలో పాతేస్తూ
విషాదాల విషాన్ని మరిచేస్తూ
పోదాం ఇంకో లోకానికి
ఇది కాదుగా లోకం
అశ్రువుల రోతగానం
అణ్వస్ర్తాల భయానకం
నిశిరాత్రుల చీకటిమైకం
రంగుల నీడలో తీరని శోకం
ఆకలి కేకల ఆవేదన సైతం
పట్టని ఈ పెద్దలోకం
కాదుగా మన తీరం
దూరంగా ఇంకో లోకం
పోదాం ఆ లోకానికి
కల కనే ప్రపంచానికి
ఊహలలో ఉన్న దేశానికి
సరిహద్దులు లేని
జెండాల రంగులు లేని
కంచెల అడ్డులేని
ధన దాసోహం సంఖ్య కాని
విలువులేమి గొప్పవి కాని
వ్యూహత్మక లోకానికి
పలుకుదాం స్వాగతం
వెతుకుదాం ప్రతిక్షణం
దొరుకుద్దని ఆశిద్దాం
శ్రీశ్రీ కోరిన మరో ప్రపంచం
ఠాగుర్ ప్రార్దించిన దేశం
మనతోనే మారుద్దాం
మనకై సృష్టిద్దాం


5 

Share


S
Written by
Surya_Kolluri

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad