Bluepadకష్టజీవి
Bluepad

కష్టజీవి

కొప్పుల ప్రసాద్
కొప్పుల ప్రసాద్
10th Jun, 2020

Share



ఆకలి కొలిమిఆకలి కొలిమి
ఊపిరే ఆయుధం
కరిగే కన్నీరు
పేదవాడి చెమట ...!!

కాళ్లు అంటిన మట్టి
గిరగిరా తిరిగే చక్రం
కుమ్మరి చేతులో పుట్టిన
అందమైన ఆకారం...!!

రెక్కలు నష్టము
చెక్కలును చీల్చి
ఱంపము నూరి
అధ్బుతమైన చిత్రం ....!!

రైతన్న సేద్యం
స్వేదము వూరి
పొలము తడిసే
ఆహారం పండే....!!

రాట్నం పోగులు
ఊడిన దారము
పిడికెడు మెతుకులు
జానడు వస్త్రము...!!

అడివిలో కర్రలు
శ్రమతో నిలువునా చీలి
ఆకలితో అల్లుకున్న
బొమ్మల చిహ్నాలు....!!

కొండలలో రాళ్లు
చేతులు నలిగి
వులి గాయాలు తిని
సుందర ఆకృతులు...!!

శుభ్రమైన వస్త్రాలు
మురికి విదిలించి
తలతల మెరిపించి
ఇస్త్రీ తో పరువు నిలిపె....!!

తలను దువ్వి
వెంట్రుకలు తరిగి
ముఖానికే వెలుగులు
మనిషికే రూపం తేచ్చి...!!

చర్మము తీసి
కాటిని కాపు కాసి
సమస్తము నడిపించే
అన్నింటికీ ముందుండి..!!

కర్మాగారపు యంత్రాలు
రక్తము తాగే పిశాచాలు
శ్రామికుడు వస్తువు సృష్టించే
ఆర్థిక ఫలాలు అందించే..!!


రంపము కొడవలి
సుత్తి గొడ్డలి
నాగలి ఱంపము
కష్టానికి చిహ్నాలు..!!

జాతుల వృత్తులు
సాంఘిక శాస్త్రలు
సమానత్వ ధర్మాలు
కావాలి అందరికీ న్యాయలు..!!

దేశ ఆర్థిక పుష్టికి
సమస్త శక్తులు
ప్రతి పౌరుడు
ముందుకు నడవాలి..!!

సామాజిక సంక్షేమం
సమస్త జాతుల క్షేమం
నిలబడిన నాడే దేశం
ప్రపంచములో అగ్రస్థానం..!!

కొప్పుల ప్రసాద్
నంద్యాల

23 

Share


కొప్పుల ప్రసాద్
Written by
కొప్పుల ప్రసాద్

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad