Bluepadస్వేచ్ఛా బానిస
Bluepad

స్వేచ్ఛా బానిస

S
Surya_Kolluri
10th Jun, 2020

Share

ఇనుప సంకెళ్ళ ఇరుకుకి
ఉండలేక బతుకీడలేక
బతుకాటను ఆడలేక
బానిసత్వమని గుండెవెనుక
బుర్రలోన నరనరమురలోన
వారెవరో అన్నారని
ఇంకెవరో రాసారని
ముందుంటామని
మాట ఇచ్చారని
శక్తి అంతా కూడచేర్చి
ముందడుగు వేసాము
దశదశలుగా వాడాము
అహింసా సత్యాగ్రహము
నిత్య సంఘర్షణము
ఇంకా ఇంకేవో వాడాము
అనుకున్నది సాధించాము
శ్వేతవర్ణ మంచుతెరలని ఛీల్చము
స్వేచ్చ వచ్చిదని ఊహించాము
కాని మేము కలగనలేదు
వదిలించుకున్నదే బంగార పంజరమా
మాకు దొరికింది నాలుగు జామచెట్లతీపని
ఆ విషయం అర్దమైయ్యేటప్పటికి
అయ్యాయి అనుకుంటా ఓ వందేళ్ళు
ఇప్పుడు అనుకుని ఎమ్ లాభం
ప్రతిరోజు చూస్తున్నాం
మతాల పిచ్చులలో
కులాల కక్షలలో
మాకెందుకను వాదనలో
సగంసగం ఙ్ఞానంలో
భిక్షువుకే దొరికిన రూపాయే
ఎక్కువని వాదనలో
ప్రతిరోజు బానిసత్వం
నామంతో టోపికి గొడవ
టోపితో కొవ్విత్తికి పగ
ఈ మధ్యలో మనకెందుకు సెగ
మనకుందిగ స్వేచ్ఛ
మనదారికి అడ్డులేని
మనకు అవసరంలేని
మనకి దక్కిన తియ్యదనాన్ని
పది కాలాలు పొగుడుతూ బతికేద్దాం



7 

Share


S
Written by
Surya_Kolluri

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad