Bluepadతెలివి
Bluepad

తెలివి

డా.ఎం.హరికిషన్
9th Jun, 2020

Share

*తెలివి - పునఃకథనం : డా.ఎం.హరికిషన్*
**************************
కందనవోలును రాజశేఖరుడు అనే రాజు పరిపాలిస్తా వుండేవాడు. ఒకరోజు ఆయన నిద్రపోతుండగా ఆయనకు ఒక కల వచ్చింది. ఆ కలలో రాజు తనకు పండ్లు వూడిపోయినట్లు కలగన్నాడు. తరువాత రోజు పొద్దున్నే లేచి కలల శాస్త్రంలో బాగా అనుభవమున్న ఇద్దరు పండితులను పిలిపించాడు.

మొదట ఒక పండితున్ని లోనికి పిలిపించి కలంతా వివరించాడు. జరిగిందంతా తెలుసుకున్న ఆ పండితుడు ఏవేవో లెక్కలేసి, ఏవేవో పుస్తకాలు తిరగేసి, “రాజా...నీ కళ్ళ ముందే నీ కొడుకూ, మనవళ్ళూ అందరూ చచ్చిపోతారు" అని చెప్పాడు. ఆ మాటలకు రాజుకు చానా కోపం వచ్చింది. భటులను పిలిపించి "వీనికి వంద కొరడా దెబ్బలు కొట్టండి" అని ఆజ్ఞాపించాడు.

తరువాత రెండవ పండితున్ని లోపలికి పిలిచి తన కలంతా వివరించాడు. ఆ పండితుడు ఏవేవో లెక్కలేసి, ఏవేవో పుస్తకాలు తిరగేసి “రాజా! మీకు మీ కొడుకులకన్నా, మీ మనవళ్ళ కన్నా ఎక్కువ ఆయుషు వుంది. మీరు కలకాలం జీవిస్తూ ప్రజలను హాయిగా పరిపాలిస్తారు" అని చెప్పాడు.

ఆ మాటలు విన్న రాజుకు చాలా సంతోషం కలిగింది. భటులను పిలిపించి “ఈ పండితునికి వేయి బంగారు వరహాలు బహుమానంగా ఇచ్చి పంపండి" అని చెప్పాడు.
**************************
డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
**************************

14 

Share


Written by
డా.ఎం.హరికిషన్

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad