Bluepadఏది కష్టం ??
Bluepad

ఏది కష్టం ??

S
Surya_Kolluri
9th Jun, 2020

Share

తెల్లనన్నం చేతికందే
మనకేమిటి యెరుక
తెల్లవారితే ఆకలిదెయ్యం
వెక్కిరించే జన్మమెకలకి ఉందని
కంటినిండుగా నిదురపట్టే
మనకేమిటి యెరుక
‌ ‌‌ రాత్రి అయితే రేపు ఏంటనే
భయంవేసే మనుషులున్నారని
రంగుటిల్లలో చెంగుమని తిరిగే
మనకేమిటి యెరుక
కుళ్ళుకాలువ ప్రక్కనుండే
వృక్షమే రక్ష అయ్యే బ్రతుకులన్నాయని
ఒటమితో కోపమొచ్చే
మనకేమిటి యెరుక
కనపడని కాలము
ఒటమినిస్తున్న అర్హూలున్నారని
రూపాయల మాయతో చదివే
మనకేమిటి యెరుక
జీవితమే ఓ పుస్తకమై
చదవక తప్పని ఙ్ఞానులున్నారని
హంగుబొంగుల భవనాలలో
పనివున్న మనకేమిటి యెరుక
చెమటచుక్కుల దుర్వాసనల
మురికియే పైకమిచ్చే రాజులున్నారని
వింతదుస్తులతో వెర్రికాంతిలో
నాట్యమాడే మనకేమిటి యెరుక
చిరిగి నలిగి విచ్చిన్నమైన
బట్టలే బోలేడున్న మౌనులున్నారని
రోజుకో బూటులేసి ముస్తాబయ్యే
మనకేమిటి యెరుక
నడిచి నడిచి అరిగి చెరిగి
పాదాలే పగిలిన పసిప్రాణాలున్నాయని
కొండల్లో గుట్టలో సిరివర్ణపు
బొమ్మలే దేవుడను మనకేమిటి యెరుక
సాయమంటే చెయ్యని మాటని
పలికినోడే దేవుడిగా చూచే భక్తులున్నారని
ఆస్తికత్వం పేరుతో దేవుళ్ళే
వ్యాపారమనే మనకేమిటి యెరుక
‌‌ మతగ్రంధాల నీతినే వంటబట్టి
మనుజుడే మాధవుడనే నాస్తికులున్నారని
విటమిన్ల మయంతో తాగే ప్రతిచుక్క
ఆరోగ్యమయ్యే మనకేమిటి యెరుక
పరిశ్రమల వ్యర్దమే కలిసిపోయి
రసాయన సమ్మేళనమే నీరైన వుర్లులున్నాయని
చిన్న జ్వరమే నుదురచెమట
పట్టించే మనకేమిటి యెరుక
నిండు నూరేళ్ళు నాల్గునెలలకే
నిండినా అంతేలే అని అంటున్నోళ్ళున్నారని


18 

Share


S
Written by
Surya_Kolluri

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad