Bluepadవార్తా పత్రికలు
Bluepad

వార్తా పత్రికలు

కొప్పుల ప్రసాద్
కొప్పుల ప్రసాద్
8th Jun, 2020

Share



అంశం: వార్తాపత్రికలు

పత్రిక ఒకటిఉన్న పదివేల సైన్యముతో సమానమని, _స్నేహితుడి లాగా ప్రజలకు రక్షణ కల్పిస్తుందని నార్ల వెంకటేశ్వరరావుగారు తాను రచించిన నార్లవారి మాట శతకంలో పత్రిక గురించి చక్కగా_ వివరించారు.

#పద్యం:

పత్రికొక్కటియున్న పదివేల సైన్యము
పత్రికొక్కటున్న మిత్ర కోటి
ప్రజలకు రక్షణ లేదు పత్రిక లేకున్న
వాస్తవమ్ము నార్లవారి మాట!

వివరణ: నార్ల వారి మాట అక్షర సత్యం. పత్రిక ఒక్కటి ఉన్నా పదివేల సైన్యంబు తో సమానము.
కోటి మంది మిత్రులతో సమానం. పత్రిక లేకపోతే ప్రజలకు రక్షణ ఉండదు. సమాజంలోని మంచిచెడులు భయం లేకుండా పత్రికలు తెలియజేస్తాయి. అందువల్ల సమాజంలో పత్రికలు ఉండాలి.
"వార్త యందు జగము వర్ధిల్లుతున్నది"
అన్నట్లు వార్తాపత్రికలు ప్రపంచమంతా విస్తరించి
జగతి అంతయు మేలు చేస్తున్నాయి. ఈనాడు మనకు అన్ని విషయాలు వార్తల ద్వారానే తెలుసుకోగలుగుతున్నాము. పత్రికల చదివేవారు తక్కువైన, నిరంతరము ఎప్పటికప్పుడు వార్తలు మనకు తెలుస్తూనే ఉన్నాయి. ఆన్లైన్లో నిమిష నిమిషానికి వార్తలు చూస్తూనే ఉన్నాము.
మనము చేసే ప్రతి పనికి తోడు కావాలంటే,
ఆ విషయం నలుగురికి తెలియాలి. అంటే ఆ వార్త పత్రికలో పడాలి. ఆ వార్త చదివి అందులో కొందరు మనకు సహాయం చేయడానికి సైన్యంగా
ముందుకు వస్తారు. అంతేకాకుండా వార్త ద్వారా మనకు మిత్రులు కూడా అవుతారు. అన్ని విధాలా మనకు సహాయ సహకారాలు అందుతాయి. పత్రికల్లో వచ్చే విషయాలు చాలామంది చదివి, అభినందనలు తెలుపుతూ ఉంటారు. తద్వారా వాళ్ళ స్నేహం పెరిగే అవకాశం ఉంది.

చెడ్డ పని చేసే వారి గురించి పత్రికల్లో వస్తే వాడిని అందరు అసహ్యించుకొని, ఛీ కొడతారు కాబట్టి వారి నుండి ప్రజలకు రక్షణ కల్పిస్తుంది. పత్రికలలో ఎన్నో చర్చనీయాంశాలు, సంఘటనలు వ్యాపార ప్రకటనలు, క్రీడలు, వైద్య, సాంకేతిక విజ్ఞానం,
ఎన్నో విషయాల గురించి మనకు తెలియచేస్తూ ఉంటాయి. కాలాన్ని గురించి విజ్ఞానాన్ని గురించి తెలిపే పత్రికలు విజ్ఞానదాయకంగా, జ్ఞానవంతులుగా తయారయ్యే అవకాశం ఉంది.

నేడు పత్రికల విషయంలో అనేక అపోహలు ఉన్నాయి. కొన్ని పత్రికలు కొన్ని వర్గాలకే పరిమితం కావడం. రాజకీయ పార్టీల ప్రమేయం ఉండడం.
వాటి ప్రచార కరపత్రాలుగా తయారు కావడం, దిగజారి వార్తలు రాయడం. కొంత సమాజానికి ఇబ్బందికర విషయమే. అంతే కాకుండా
పత్రికల స్వేచ్ఛను కూడా ప్రభుత్వాలు అణగదొక్కడం చాలా విచారకరమైన విషయం. పత్రికలు నీతివంతంగా, నిజాయితీతో పనిచేస్తూ , ప్రజల రక్షణకు వారధిగా ఉంటూ
వారి సమస్యలపై నిరంతరం పోరాడేందుకు ముందుగా ఉండాలి.

#పత్రికలు సామాన్యుడికి రక్షణకవచంగా నిలవాలి#

కొప్పుల ప్రసాద్
నంద్యాల, 9885066235

17 

Share


కొప్పుల ప్రసాద్
Written by
కొప్పుల ప్రసాద్

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad