Bluepadనేనే నేనే సముద్రం
Bluepad

నేనే నేనే సముద్రం

కొప్పుల ప్రసాద్
కొప్పుల ప్రసాద్
8th Jun, 2020

Share

*ప్రపంచ సముద్ర దినోత్సవం*

*నేనే నేనే సముద్రం*

నాలోనే సృష్టికి జీవం
నాతోనే సృష్టి అంతం
నా లోనే ఆటుపోట్లు
నాలోనే ప్రశాంతం

సిరి లెన్నో నింపుకున్న
సిరిదేవి కి జన్మనిచ్చి
అమృతాన్ని అందించి
దేవతలకు ప్రాణం పోశాను

విష్ణుమూర్తికి నివాసం ఇచ్చి
అతనికి భార్యను అందించి
కూతురు గంగను వివాహమాడి
అతనికి మణులు అర్పించాను

దేవేంద్రుడికి ఐరావతం
కల్పవృక్షము కామధేనువు
సకల సంపదలు ధారపోసి
స్వర్గానికి వెలుగు తెచ్చాను

శివుడికి విషం ఇచ్చాను
నా భార్యను నెత్తిన పెట్టాను
చల్లదనము కలిగించాను
గరళకంఠుడు అనీ పేరు తెచ్చాను

రాముని లంకకు చేర్చాను
రాముడికి తోడుగా నిలిచాను
యుద్ధములో సహకరించాను
సీతారాములను కలిపాను

నదుల అన్నింటికీ నేనే భర్త
నాలో చేరుతారు వారంతా
ముత్యాలతో గౌరవిస్తాను
వారి ప్రయాణ సేద తీరుస్తాను

మేఘానికి జలం అందిస్తాను
సర్వజీవులకు ప్రాణం పోస్తాను
కోట్ల జీవులకు ఆహారం నా వల్లే
సృష్టి జీవన ప్రదాతను నేనే

మానవ జీవిత సాగరం
సాగాలని మత్స్య సంపద
నాలోనే సృష్టించి
జీవనాన్ని ప్రసాదించు

దేశాల మధ్య బంధం
అభివృద్ధి సంబంధం
నా వల్లనే అది సాధ్యం
అందరికీ స్నేహబంధం నేనే

ఏడు సముద్రాలు నేనే
భూమిలో మూడో భాగం సేనే
నేనే నేనే సముద్రం
ధరణి లోపల విశ్వరూపం నేనే

*కొప్పుల ప్రసాద్*
*నంద్యాల*


20 

Share


కొప్పుల ప్రసాద్
Written by
కొప్పుల ప్రసాద్

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad